
బ్రహ్మపుర నగరం : గంజాం జిల్లా కోటినడ పంచాయతీలోని సిద్దఖండి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకొని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడిని బయటకు తీసి దిగపొహండి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





