
పర్లాఖెముండి: గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణ శివారులోని గుమ్మగెడ్డ ప్రాంతంలో ఉన్న బాణసంచా దుకాణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాణసంచా దుకాణంలో అమ్మకానికి సిద్ధంగా విలువైన సామగ్రిని నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.లక్షల విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సామగ్రికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో బాణాసంచా దుకాణాన్ని సీజ్‌ చేశారు. దుకాణంలో ఉన్న సామగ్రి విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని ఎస్సై ప్రపుల్ల జగరాంగా తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





