
ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారులు ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరం మండలంలోని అన్నంపల్లి టోల్‌ప్లాజా వద్ద ప్రైవేటు బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు. యానాం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే 21 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను పరిశీలించారు. నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.40,800 అపరాధ రుసుం విధించినట్లు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజా రవాణా బస్సుల్లో విధిగా నిబంధనలు పాటించాలని తనిఖీలు నిరంతం కొనసాగుతాయని డీటీఓ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్, వరప్రసాద్‌ పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





