
లోడుతో వెళ్తున్న లారీల బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్నాయి. బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనం అదుపు తప్పి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ముందు ఉన్న లారీని ఢీకొట్టి డివైడర్‌ పైనుంచి దూసుకెళ్తున్న లారీ కోదాడ, న్యూస్‌టుడే: లోడుతో వెళ్తున్న లారీల బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్నాయి. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో వాహనం అదుపు తప్పి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాహనాల యజమానులు ఎప్పటికప్పుడు వాహనానికి మరమ్మతులు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిత్యం వాహనం నడిపే డ్రైవర్లు సైతం బ్రేక్‌ పని చేస్తుందా.. లేదా అనేది సరిచూసుకోవాలి. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. కాసుల కోసమే తనిఖీలు..!.. కొందరు రవాణా శాఖ అధికారులు, పోలీసులు వాహనాలను తనిఖీ చేసే సమయంలో కాసుల కోసం కక్కుర్తి పడి నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వసూళ్ల అలవాటుతో తనిఖీలు చేయడం లేదని కొందరు డ్రైవర్లు చెబుతున్నారు. వాహనాల బ్రేకులు ఫెయిలై ప్రమాదాలు జరిగే వరకు రవాణా శాఖ అధికారులు గుర్తించకపోవడం దారుణం. లారీలు, ఇతర వాహనాల యజమానులు ఎప్పటికప్పుడు తమ వాహనాలు మంచి కండీషన్‌లో ఉండేలా చూసుకోవాలి. డ్రైవర్లు వాహనం నడిపే ముందు బ్రేకులు పడుతున్నాయా.. లేదా అనేది చూసుకోవాలి. తనిఖీల్లో వాహనాల కండీషన్‌ చూసేలా చర్యలు తీసుకుంటాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





