
అబుదాబీలో ఐటీ ఉద్యోగం... ఆనందంగా సాగిపోతోంది ప్రియ జీవితం. కానీ, ఆధునిక జీవనశైలి, చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేలా చేసింది. దాంతో ఒక్కసారిగా కుంగిపోయిన ప్రియ, రకరకాల సంప్రదాయ పద్ధతులని ప్రయత్నించింది. మెయిపదం, కార్లకట్టై... ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? వీటితో తమిళనాడుకి చెందిన ప్రియదర్శిని ఓ స్టార్టప్‌నే ప్రారంభించారు. ఆ స్టార్టప్‌ ఏంటో, ఆమె ఏం చేస్తున్నారో తెలుసుకుందామా... అ బుదాబీలో ఐటీ ఉద్యోగం... ఆనందంగా సాగిపోతోంది ప్రియ జీవితం. కానీ, ఆధునిక జీవనశైలి, చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేలా చేసింది. దాంతో ఒక్కసారిగా కుంగిపోయిన ప్రియ, రకరకాల సంప్రదాయ పద్ధతులని ప్రయత్నించింది. కానీ, అన్నీ పైపైన సాంత్వన ఇచ్చేవే తప్ప, లోతుగా ప్రభావం చూపలేకపోయాయి. అప్పుడే తనకు తమిళ ప్రాచీన యుద్ధ కళలు గుర్తొచ్చాయి. అవే మెయిపదం, కార్లకట్టైలు... శారీరక సామర్థ్యం కోసం ప్రాచీనకాలంలో యోధులు, రక్షకులు, యుద్ధ కళాకారులతోపాటు సామాన్య ప్రజలూ వీటిని సాధన చేసేవారట. అవే సాధన చేశారు ప్రియ. ఆమెలో మార్పు మొదలైంది. రోజురోజుకీ శక్తి పెరగడాన్ని గమనించారు. ఇది ఆమెలో ధైర్యాన్ని నింపింది. దాంతో తనలాంటి వారికి నేర్పించాలని అనుకున్నారు. 2021లో ఉద్యోగాన్నీ వదిలేశారు. ‘మేయ్‌ ట్రెడిషనల్‌ ఫిట్‌నెస్‌’ను ప్రారంభించారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఈ విద్యలో శిక్షణ ఇస్తున్నారు ప్రియ. జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు. అంతర్జాతీయంగా మెయిపదం, కార్లకట్టైలో సర్టిఫికెట్‌ పొందిన మొదటి మహిళా శిక్షకురాలిగా నిలిచారు. ప్రాచీన తమిళ కళను నేటి తరానికి అందిస్తున్నందుకుగానూ ప్రతిష్ఠాత్మక ‘క్షక్తిరీ’ బిరుదునీ పొందారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





