
తమిళనాడు సీఎం, టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. లండన్ వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పిన విజయ్.. తన స్నేహితుడు, మోటార్ స్పోర్ట్స్ రేసర్ అజిత్ కుమార్ కార్ రేసు చూడటానికే వెళ్లారని డీఎంకే నేతలు ఎద్దేవా చేశారు.



