అంగారకుడు(కుజుడు) కర్కాటకంలో సంచారం చేయడంతో పాటు గురు గ్రహంతో కలయిక జరపడం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ కఠిన శ్రమకు తగిన ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు ఊహించని ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. నిధుల కొరత కారణంగా గతంలో పెండింగులో ఉన్న పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలున్నాయి. సింహ రాశి వారికి కుజుడి సంచారం వల్ల సమీప భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగులకు ఉద్యోగం మారేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ బాధ్యతలు పెరగొచ్చు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. గతంలో లావాదేవీల నుంచి మీ డబ్బును తిరిగి పొందొచ్చు. ఈ కాలంలో ఆధ్యాత్మిక, మతపరమైన కార్యకలాపాల పట్ల మీ ఆసక్తిని కనబరుస్తారు. కర్కాటక రాశిలో కుజుడి సంచారం వల్ల తులా రాశి వారికి ఒక వరంలా మారే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. మీ ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వినొచ్చు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. ఈ సమయం విద్యార్థులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభించొచ్చు. వృశ్చిక రాశి వారికి కుజుడి సంచారం వల్ల కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించొచ్చు. కుజ, గురు గ్రహాల సంయోగంతో మీకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. ఉద్యోగం, వ్యాపారం రెండింట్లోనూ పురోగతి సాధించే అవకాశాలున్నాయి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News