
ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థులకు ఉన్నత చదువుల విషయంలో ఆర్థిక సమస్యలే అవరోధమవుతున్నాయి. ఇలాంటివారంతా నిశ్చింతగా విద్య కొనసాగించడానికి ఇప్పుడెన్నో స్కాలర్షిప్పులు ఉన్నాయి. ఉపకార వేతనాలతో విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తూ.. దేశంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ఇంటర్మీడియట్ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకూ వివిధ స్కాలర్షిప్పులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. వీటికోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటే అవసరమైన ధ్రువపత్రాల





