
కొత్తూరు మండలంలోని కుంటిభద్ర జడ్పీహెచ్ స్కూల్లో బుధవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
© 2026 nimisham.in

కొత్తూరు మండలంలోని కుంటిభద్ర జడ్పీహెచ్ స్కూల్లో బుధవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కొత్తూరు: కొత్తూరు మండలంలోని కుంటిభద్ర జడ్పీహెచ్‌ స్కూల్‌లో బుధవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓజోన్ పొర ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్విజ్, కరపత్రాల తయారీ, డిబేట్ వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులు బి. సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ప్రధానోపాధ్యాయులు బీవీ రమణ పర్యవేక్షించారు. కొత్తూరులో నేత్రవైద్య శిబిరం కొత్తూరు: కొత్తూరులోని శ్రీవెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో రాగోలు జెమ్స్‌ హాస్పిటల్‌ బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించింది. ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఇప్పిలి జానకిరామయ్య 49 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో 17 మందికి దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో సమస్య ఉన్నవారిని రాగోలు జెమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. వారికి ఉచితంగా కంటి ఆపరేషన్‌తో పాటు భోజనం, భోజనము, మందులు, ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.