
ఆళ్లగడ్డ గ్రామీణం: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం ఆలయ ప్రధాన తిరువీధిలో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ.1.10 లక్షల విలువచేసే 15 అడుగుల భారీ గణనాథుడిని కొలువుదీర్చారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు, ఆలయ సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





