
హో టల్‌కి వెళ్తే నచ్చిన వంటకాలు ఆర్డర్‌ చేసి కడుపు నిండా తినేసి వస్తాం. నృత్యప్రదర్శనకో, సంగీత కచేరీకో, చిత్ర ప్రదర్శనకో వెళ్తే ప్రశాంతంగా కాసేపు ఆ కళను ఆస్వాదిస్తాం. సినిమాకు వెళ్తే కళ్లు రెండూ తెరకు అప్పగించి బయటి ప్రపంచాన్ని మర్చిపోతాం. ఇక రీడర్స్‌ క్లబ్‌కో బుక్‌ క్లబ్‌కో వెళ్లినా అంతే. పుస్తకాల్లో మునిగి తేలతాం. ఇవేవీ కాకుండా కాలక్షేపానికి ఇష్టమైన పని చేస్తూనే మెదడుకూ పదును పెట్టే చర్చలు చేయలేమా? సమకాలీన సమస్యలపై, శాస్త్ర సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోలేమా? తప్పకుండా చేయొచ్చంటున్నాయి పలు సంస్థలు. పింట్‌ ఆఫ్‌ సైన్స్, పింట్‌ ఆఫ్‌ వ్యూ, లెక్చర్స్‌ ఆన్‌ ద రాక్స్, మంథన్‌... ఇలాంటి పేర్లు విన్నారా ఎప్పుడైనా? ఇవన్నీ మేధోమథనానికి అవకాశం కల్పిస్తున్న సంస్థలు. చాలావరకూ లాభాపేక్ష లేనివి. మేధావులనూ సాధారణ ప్రజలనూ ఒక వేదిక మీదికి తెచ్చి సమకాలీన అంశాలపై చక్కటి బహుముఖీన చర్చకు అవకాశం కల్పిస్తున్నాయి. లిటరేచర్‌ ఫెస్టివల్స్‌ లాగే ‘పింట్‌ ఆఫ్‌ సైన్స్‌(పీవోఎస్‌)’ ఏటా మేలో గ్లోబల్‌ సైన్స్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తోంది. వివిధ నగరాల్లో మూడురోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో సైంటిస్టులే వచ్చి తమ తాజా పరిశోధనల గురించి చర్చిస్తారు. ఏడాది పొడుగునా కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సైంటిఫిక్‌ విషయాల పట్ల ఆసక్తి కలవారు ఎవరైనా వీటిలో పాల్గొనవచ్చు. ఇక ‘పింట్‌ ఆఫ్‌ వ్యూ(పీవోవీ)’ మనదేశానికి చెందిన అతి పెద్ద లెక్చర్‌ కమ్యూనిటీ. బెంగళూరులో మొదలై వివిధ నగరాలకు సేవలను విస్తరించింది. హైదరాబాద్‌లో ‘మంథన్‌ ఇండియా’ ఏటా అక్టోబరు 2న మంథన్‌ సంవాద్‌ పేరుతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తోంది. పలు రంగాలకు చెందిన నిపుణులు ఈ సంస్థల కార్యక్రమాల్లో పాల్గొని తమ ఆలోచనలను పంచుకుంటూ ఉంటారు. ‘లెక్చర్స్‌ ఆన్‌ ద రాక్స్‌’ సంస్థ కూడా వేర్వేరు నగరాల్లోని పబ్‌లలో కార్యక్రమాలను చేపడుతోంది. దీనికి టికెట్‌ కొనుక్కుని వెళ్తే కూర్చుని ఇష్టమైన డ్రింక్‌ని ఆస్వాదిస్తూనే మంచి ప్రసంగాన్నీ వినవచ్చు. ఇలా పనిచేస్తున్న సంస్థలు మరెన్నో ఉన్నాయి. పదిహేను రోజులకోసారో, నెలకోసారో... కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. కొన్నిటికి టికెట్‌ ఉంటుంది. కొన్ని ఉచితంగా అందరికీ ప్రవేశం కల్పిస్తాయి. ముందుగానే ఏ అంశం మీద ఎవరు మాట్లాడతారు అన్నది ప్రకటిస్తారు. ఉపన్యాసం మరీ ఆఫీసులోనో, యూనివర్సిటీలోనో ఉన్నట్లు ఫార్మల్‌గా కాకుండా స్వేచ్ఛగా ఉంటుంది. ముప్పావుగంట నుంచి గంట వరకు వక్తలు ప్రసంగిస్తారు. అది అయిపోయాక, ప్రేక్షకులు తమ సందేహాలు అడిగి తీర్చుకోవచ్చు. వంద నుంచి రెండొందల మంది దాకా వీటికి హాజరవుతుంటారు. భిన్న రంగాలకు, వృత్తులకు చెందిన నిపుణులు వస్తారు కాబట్టి పరిచయాలు పెరుగుతాయి. ఆయా రంగాల గురించి అవగాహనా పెరుగుతుంది. ప్రతి పట్టణంలోనూ అక్కడి యువత చొరవ తీసుకుని లైబ్రరీల్లో, పాఠశాల, కళాశాలల్లోని ఆడిటోరియంలలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టవచ్చు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనం, చట్టబద్ధమైనపాలన, పౌర సంక్షేమం, విద్యా వైద్య వసతుల అందుబాటు తదితరాల ఆధారంగా బాధ్యతాయుతమైన దేశ సూచీ రూపొందిస్తారు. పేదరిక నిర్మూలన, సహజ వనరుల సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, అంతర్జాతీయ సహకారం, శాంతి స్థాపన, మానవతా సాయం వంటి వాటినీ లెక్కిస్తారు. అన్నింటినీ విశ్లేషించి ఈ ఏడాది 154 దేశాలతో రూపొందించిన రెస్పాన్సిబుల్‌ నేషన్‌ ఇండెక్స్‌లో ఇండియా 16వ స్థానంలో నిలిచింది. ఆ సూచీలో తొలి పది ర్యాంకులు సాధించిన దేశాలు, వాటి స్కోరు (ఒకటికి)... .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





