
ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి, సికినాపూర్‌ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి కనిపించడంతో రెండు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పొలాల్లోకి వెళ్లేందుకు కూలీలు, రైతులు జంకుతున్నారు. కర్రలతో తాము కాపలా ఉంటామంటూ రైతులు భరోసా ఇస్తేనే కూలీలు పనులకు వస్తున్నారు. శనివారం పలువురు రైతులు కలిసి కర్రలతో చప్పుడు చేసుకుంటూ చుట్టూ ఇలా తిరిగారు. ఆ సమయంలో కూలీలు సోయా పంటకు రసాయన మందు పిచికారీ చేశారు. ఈనాడు, ఆదిలాబాద్, తలమడుగు, న్యూస్‌టుడే .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





