
సాలూరు: ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణానికి మేలు జరిగేలా చూడాలని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం సాలూరు పట్టణంలోని తహసీల్దార్ కూడలిలో మట్టి గణపతి ప్రతిమలను మంత్రి పంపిణీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ) విగ్రహాలను, నీటిని కలుషితం చేసే హానికర రంగులను వినియోగించే ప్రతిమలను వాడొద్దని పిలుపునిచ్చారు. పట్టణం, పరిసర గ్రామాల ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





