
Huawei Pura X.. స్మార్ట్‌ఫోన్ అంటే సాధారణంగా పొడవైన ఆకారమే గుర్తొస్తుంది. కానీ Huawei మాత్రం దీనికి భిన్నంగా పాస్‌పోర్ట్‌ను పోలిన డిజైన్‌తో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. Huawei Pura X View పేరుతో వచ్చిన ఈ డివైజ్ ప్రపంచంలోనే తొలి వైడ్-స్క్రీన్ నాన్-ఫోల్డబుల్ ఫోన్‌గా నిలిచింది. చైనాలో విడుదలైన తొలిరోజే 1,80,000కి పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
భిన్నమైన డిజైన్‌తో పాటు భారీ కెమెరా, పెద్ద బ్యాటరీ, అధునాతన ఫీచర్లతో Huawei Pura X View స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబర్ 7న చైనాలో విడుదలైన ఈ ఫోన్‌కు మొదటి రోజే భారీ స్పందన వచ్చింది. 12GB RAMతో పాటు 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉండటం కూడా దీని ప్రత్యేకతగా మారింది.





