
లంగాల నూనె కూడా బూజు మరకలు తొలగిస్తుంది దీనికోసం నీళ్లలో కొన్ని చుక్కల లవంగాల నూనె కలిపి బూజు మరకలపై రాసి క్లీన్ చేసుకోవాలి. డిష్ వాష్‌కు ఉపయోగించే సోప్‌ను నీళ్లలో కలిపి ఈ నీళ్లతో బూజు మరకలు తొలగించుకోవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బేకంగ్ సోడాలో గోరవెచ్చని నీళ్లు కలిపి పేస్ట్ చేయండి. దీనిని గోడలపై బూజు ఉన్నచోట అప్లై చేసి స్క్రబ్ చేస్తే మరకలు ఈజీగా పోతాయి. వైట్ వెనిగర్‌లోని ఎసిడిక్ గుణాలు గోడలపై ఫంగల్ బూజు తొలగించడంలో సహాయపడుతుంది. దీనికోసం నీళ్లు, వైట్ వెనిగర్ సమపాళ్లలో తీసుకుని ఈ మిశ్రమంతో గోడలను క్లీన్ చేస్తే సరిపోతుంది. నిమ్మరసంలోని యాసిడ్ నేచర్ గోడలపై బూజు మరకలు ఈజీగా తొలగిస్తుంది. దీనికోసం నిమ్మరసాన్ని మరకలు ఉన్నచోట రాసి క్లీన్ చేసుకుంటే చాలు. నీళ్లలో ఒక స్పూన్ టీ ట్రీ ఆయిల్ కలిపి స్ప్రే బాటిల్లోకి తీసుకోండి. దీనిని బూజు ఉన్నచోట స్ప్రే చేసి క్లీన్ చేస్తే మంచిది. 3% హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఉపయోగించి గోడలపై ఉన్న బూజు మరకలు తొలగించవచ్చు. దీనికోసం నేరుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ రాసి క్లీన్ చేస్తే సరిపోతుంది. బోరాక్స్ పౌడర్‌లో నీళ్లు కలిపి పేస్ట్ చేయండి. దీనిని బూజు ఉన్నచోట అప్లై చేసి క్లీన్ చేసుకుంటే మరకలు తొలగిపోతాయి. మీరు గోడలపై ఉన్న బూజు మరకలు తొలగించేటపుడు మీ చేతులకు గ్లోవ్స్ కచ్చితంగా ధరించండి. అలాగే ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోండి. ఇంటి నుంచి గాలి బయటకు వెళ్లేలా కిటికీ, తలుపులు తెరిచి క్లీన్ చేయండి. క్లీన్ చేసేటపుడు ఫర్నీచర్, వస్తువులపై ఏదైనా కవర్ కప్పండి.





