
Gold Hallmark: రాబోయే దసరా, దీపావళి పండగ సీజన్లో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీ కోసమే. ఢిల్లీ లో పది గ్రాముల బంగారం రేట్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రభుత్వం బంగారు ఆభరణాల హాల్ మార్కింగ్ ఛార్జీలను పెంచేసింది. హాల్ మార్కింగ్ ఛార్జీలు ఏకంగా 67% పెరిగాయి. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఈ భారీ పెరుగుదలతో బంగారాన్ని హాల్ మార్క్ చేయించుకోవడం ఖరీదైపోయింది.





