

Bigg Boss Today Promo : నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో ఫైట్ చేసి చివరకు దేబ్జానీ, త్రిగున్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలిని లు కెప్టెన్సీ రేసులోకి ముందుకు వెళ్లారు. ఇవాళ వీళ్ళ మధ్య పోరాటం కొనసాగనుంది. అయితే నేడు రిలీజ్ చేసే ప్రోమోలో వీళ్ళ ఫైట్ ఉంటుంది అనుకుంటే కామెడీ ప్రోమో రిలీజ్ చేసారు.
నేటి ప్రోమోలో అందరూ కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. త్రిగున్ చెప్పే డైలాగ్స్ కి షాలిని నటిస్తుంది. మధ్యలో వంశీ వచ్చి కామెడీ చేసాడు. ఆ తర్వాత నరేష్, రామ్ ప్రసాద్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఇమిటేట్ చేసారు. దీంతో దేబ్జానీ, వర్షిణి, అమన్, ఝాన్సీ పడీ పడీ నవ్వుకున్నారు. నిన్నంతా ఒకరికొకరు గొడవ పడి ఇవాళ అందరూ హాయిగా సరదాగా నవ్వుకోవడంతో ఆడియన్స్ షాక్ అవుతున్నారు. దేబ్జానీ కూడా నిన్న ఫుల్ గా ఏడ్చి ఇవాళ సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. మళ్ళీ టాస్క్ మొదలుపెడితే మాత్రం అందరి మధ్య ఫైట్స్ రావడం ఖాయం.
Also Read : Bigg Boss 10 Telugu Captaincy : ఒకరి మీద ఒకరు పడి కొట్టేసుకొని.. ఏడ్చేసి.. గొడవపడి.. ఆఖరికి రోహిత్ వాళ్ళను అడుక్కొని.. బిగ్ బాస్ 10 ‘డే 10’ ఫుల్ ఎపిసోడ్.. మీరు కూడా ఈ కామెడీ ప్రోమో చూసేయండి..





