
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలిగించేలా నివాస ధ్రువీకరణ పత్రాల (AP Government) జారీ విధానంలో కీలక నిర్ణయం తీసుకుంది.
© 2026 nimisham.in

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలిగించేలా నివాస ధ్రువీకరణ పత్రాల (AP Government) జారీ విధానంలో కీలక నిర్ణయం తీసుకుంది.

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలిగించేలా నివాస ధ్రువీకరణ పత్రాల (AP Government) జారీ విధానంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమలులో ఉన్న పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ, రెసిడెన్స్ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారాన్ని మళ్లీ తహసీల్దార్లకే అప్పగిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల సంక్షేమం, విద్యా, ఉద్యోగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక అడుగు ముందుకు వేసింది.
Kishan Reddy: తెలుగు భాషను అణచివేసి ఉర్దూను రుద్దారు.. విమోచన వేడుకల్లో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు గతంలో 2015 జూన్ 20న తీసుకొచ్చిన మార్పుల ప్రకారం నివాస రుజువుగా కేవలం ఆధార్, రేషన్ కార్డులను మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. దీనివల్ల తహసీల్దార్ల ద్వారా సర్టిఫికెట్ల జారీ చేయడం నిలిచిపోయింది. తాజాగా ప్రభుత్వం ఆ నాటి జీవోను రద్దు చేసి, పాత పద్ధతినే అమల్లోకి తెచ్చింది. ఇకపై ఈ పత్రం కావలసిన వారు తగిన ఆధారాలతో తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే, తహసీల్దారు స్వయంగా స్థానికంగా విచారణ జరిపి నివాసాన్ని ధ్రువీకరిస్తూ పత్రం అందజేస్తారు. విద్యార్థులకు ప్రవేశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఓటరు జాబితాలో పేర్ల నమోదు వంటి పలు ముఖ్యమైన ప్రక్రియలకు స్థానిక గుర్తింపు అత్యంత అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.2015 జీవో రద్దు.. జారీ ప్రక్రియ ఇదే:
ప్రజల అవసరాలు.. సీఎస్ ఉత్తర్వులు:
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







