

- విజయసాయి సంచలన ట్వీట్
- మతం మార్పిడులపై ప్రశ్నలు
- ద్వారంపూడి వీడియో వైరల్
Vijayasai Reddy: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ Vijayasai Reddy) వేదికగా సొంత పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైకాపాలో గతంలో ఎంతమంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కించుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపాలోని నంబర్ వన్ నాయకులే దీనికి సమాధానం చెప్పాలని స్పష్టం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Aramghar Road Accident: ఆరంఘర్ చౌరస్తాలో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్ లారీ.. తండ్రీకూతురు మృతి!
ద్వారంపూడి పాత వీడియోతో దాడి:
తన ఆరోపణలకు బలం చేకూర్చేలా 2024 ఎన్నికలకు ముందు నాటి వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఒక క్రైస్తవ సభలో మాట్లాడిన పాత వీడియోను విజయసాయి రెడ్డి తన పోస్ట్‌కు జత చేశారు. ఆ వీడియోలో ద్వారంపూడి మాట్లాడుతూ.. “140 రోజుల తర్వాత మనకు ఒక క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, అది జగన్ కావడం నా కోరిక” అని అన్నారు. అంతేకాకుండా జగన్ సీఎంగా ఉంటే క్రైస్తవులు స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకోవచ్చని, జగన్ మళ్లీ అధికారంలోకి రావడానికి పాస్టర్లు ప్రార్థనలు చేయాలని కోరినట్లు ఆ వీడియోలో ఉంది.
వైకాపా వర్గాల్లో తీవ్ర చర్చ:
విజయసాయి రెడ్డి చేసిన ఈ తాజా పోస్ట్ మరియు ద్వారంపూడి వీడియో ట్యాగింగ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీనే నేరుగా టికెట్లు, పదవుల కోసం మతం మార్పిడుల అంశాన్ని తెరపైకి తెచ్చి వైకాపా నాయకత్వాన్ని నిలదీయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.





