
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fact Check: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆన్ లైన్ లో వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలన.. ఏం జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. అసలు విషయాలే కాదు ఫేక్ న్యూస్ కూడా ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమా.. కాదా అని ఆలోచించకుండానే చాలా మంది వాటిని షేర్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు.. ఆడియోలను ఎడిట్ చేసి.. వాస్తవానికి విరుద్ధంగా కథనాలను జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఫేక్ న్యూస్ లు మరింత ఎక్కువగా అయ్యాయి. అలా వైరల్ చేస్తున్న వార్తల్లో నిజం ఎంత.. తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సాక్ష్యాత్తూ భారత ప్రధాని మోదీ ఫ్రీ మొబైల్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత తెలుసుకుందాం. ఈ వైరల్ వార్త వెనకున్న అసలు నిజమేంటీ? ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారితోపాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కూడా ఈ స్కీముకు అర్హులు అంటూ పేర్కొన్నారు. ఈ వార్త వెనకున్న అసలు నిజాన్ని PIB ఛేదించింది. వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని కొట్టిపారేసింది. ఈ విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ వీడియోతోపాటు ఉన్న క్యాప్షన్ లో ఫ్రీ మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పే వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిఐబీ తెలిపింది. ఈ వీడియోను







