Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో బాలు తాగి ట్రాఫిక్ పోలీస్‌ అరుణ్‌తో గొడవ పెట్టుకోవడం హైలైట్‌గా నిలిచింది. తాను తాగలేదని తెలిసినా బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించడం అవమానంగా ఉందంటూ బాలు రచ్చ చేస్తాడు. అరుణ్‌ను అరెస్ట్ చేయమంటూ గోల చేస్తాడు. చివరకు రాజేష్ బాలును అక్కడి నుంచి తీసుకెళ్తాడు.ఇంటికి వచ్చిన బాలు తూలుతూ సోఫాలో పడిపోతాడు. అతడు తెచ్చిన డబ్బును మీనాకు ఇవ్వగా, తాగుబోతుల డబ్బు తీసుకోనని మీనా స్పష్టం చేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. బాలు రూ.52,500ను పూల్లో పెట్టి ఇచ్చినా మీనా తీసుకోదు. దీంతో బాలు కోపంగా వెళ్లిపోతాడు.