
చర్ల: మండలంలోని కుర్నపల్లి అడవుల్లో ఉచ్చులకు చిక్కి మృతి చెందిన చిరుత పులి చర్మం, శరీర భాగాలను తరలిస్తున్న ఆరుగురిని అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్‌తో కలిసి ఎఫ్‌డీఓ నిశ వివరానలు వెల్లడించారు. చర్ల మండలం కుర్నపల్లికి చెందిన కోరం నారాయణ, పొడియం దేవేందర్ (కిష్టారంపాడు ), అట్టం సాయికిరణ్ (బెస్త కొత్తూరు ), జీలకర్ర రాధాకృష్ణ (గోంపుని గూడెం, ములుగు జిల్లా), పొడియం సంతోష్ దీర్ధో బండి ( కిష్టారం పాడు )లపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు వన్యప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యత అన్నారు. వన్య ప్రాణులను వేటాడటం, శరీర భాగాలను విక్రయించటం, రవాణా చేయడం నేరమన్నారు. నిందితుల వద్ద నుంచి చిరుత పులి చర్మం, 9 గోళ్లు ఆరు పళ్లు, పుర్రెను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సీఐ రాజు వర్మ, అటవీ క్షేత్ర అధికారిణి రంజిత పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





