
బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండిచేయి ఆంధ్రప్రదేశ్ నేతలకు మూడు పదవులు డీకే అరుణ స్థానంలో వైస్ ప్రెసిడెంట్‌గా దగ్గుబాటి పురందేశ్వరి ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ స్థానంలో అమర్‌పాల్ మౌర్య రాంమాధవ్, వసుంధరా రాజే సహా 13 మంది ఉపాధ్యక్షులు అన్ని సెల్స్ సంయుక్త ఇన్‌చార్జిగా విష్ణువర్ధన్ రెడ్డి నియామకం నబీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 8 నెలలకు కొత్త టీమ్ అందులో దక్షిణాదిన ప్రాతినిధ్యం దక్కని ఏకైక రాష్ట్రం తెలంగాణ త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?.. అరుణకు చాన్స్? న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు నితిన్ నబీన్ తన టీమ్‌ను సోమవారం ప్రక టించారు. అయితే.. ఈ కొత్త బృందంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు ఇవ్వకుండా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి ఝలక్ ఇచ్చింది. దేశంలోని దాదాపు 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు ఈ టీమ్ లో అవకాశం కల్పించగా.. దక్షిణాదిన ప్రాతినిధ్యం లభించని ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. పార్టీ జాతీయ పదాధికారుల కమిటీలో తెలంగాణ ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఇదే మొదటిసారి. అదే సమయంలో ఏపీకి చెందిన ముగ్గురు నేతలకు (పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, ఢిల్లీ కోటాలో రాం మాధవ్) పదవులు దక్కాయి. డీకే అరుణ స్థానంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. అలాగే.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉన్న కె.లక్ష్మణ్ స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అమర్ పాల్ మౌర్యను నియమించారు. ఇక.. పురందేశ్వరితోపాటు, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ సహా 13 మందిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. జాతీయ సంస్థాగత వ్యవహారాల జాతీయ


























