
DK Aruna: ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన లీడర్‌షిప్‌లో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై విశేషమైన ఖ్యాతిని గడించిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశంసించారు. రాబోయే 2047 సంవత్సరం నాటికి దేశాన్ని సంపూర్ణ
‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆమె స్పష్టం చేశారు.
మహిళల ఆర్థిక స్వావలంబన, రైతుల అభ్యున్నతి కోసం మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను డీకే అరుణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “రాబోయే 2030 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది మహిళలను ‘లఖ్పతి, క్రోర్‌పతి దీదీలు’గా మార్చడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ. 24 వేల వరకు ఎరువుల సబ్సిడీని అందిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు దేశంలోని కోట్లాది కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాయి” అని ఆమె పేర్కొన్నారు.
Read also: Singareni Collieries: సింగరేణికి కేంద్రం శుభవార్త
ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేతమైన, చారిత్రాత్మక నిర్ణయాల వల్లే భారత్ నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోందని అరుణ కొనియాడారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడకుండా అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని కేంద్రం ఉక్కుపాదంతో అణచివేసిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పులతో పాటు.. జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి భారీ కార్యక్రమాలు దేశ రూపురేఖలను మార్చేశాయని వివరించారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న మోదీ మార్క్ పాలన సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని ఆమె స్పష్టం చేశారు.
Mahabubnagar crime: చదువులో ఓటమి.. బలవన్మరణానికి పాల్పడిన ఇంటర్ విద్యార్థి!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Singareni Collieries: సింగరేణికి కేంద్రం శుభవార్త
Nampally Flyover: హైదరాబాద్ అసెంబ్లీ వద్ద కొత్త ఫ్లైఓవర్ ప్లాన్
TG ICET-2026 Results out: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల రాంక్ కార్డు లింక్ ఇదే!
Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
CMR schools inauguration: మేడ్చల్‌లో సీఎంఆర్ స్కూల్స్ ప్రారంభం.. క్రికెట్ ఆడిన మల్లారెడ్డి