
Vigilance Inspection | శివ్వంపేట, సెప్టెంబర్ 15 : మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలం గూడురు శివారులోని ఓం సాయి వెంకటరమణ రైస్ మిల్లులో మంగళవారం హైదరాబాద్కు చెందిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 2022–23 రబీ సీజన్ కు సంబంధించి 6,026 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు మెదక్ జిల్లా సివిల్ సప్లై ఇన్సిపెక్టర్ తాటి నర్సింలు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి రూ.53,91,606 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ధాన్యం నిల్వలు, రికార్డుల్లో వ్యత్యాసాలపై విజిలెన్స్ అధికారులు వివరాలను నమోదు చేసుకుని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు. Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్ హయత్నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు





