
– సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తుంగతుర్తి, సెప్టెంబర్ 15 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగం మరువలేనిదని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, అన్నారం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవంలో పాల్గొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు దాయం రాజారెడ్డి, దొగ్గరి ముత్లింగం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పేదల హక్కుల కోసం, నైజాం రాచరిక వ్యవస్థ నిర్మూలన కోసం, గ్రామీణ భూస్వామ్య దొరల దౌర్జన్యాల అంతం కోసం జరిగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాటంలో దాయం రాజిరెడ్డి పోరాట పటిమ మరువలేనిదఅన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ముత్తిలింగం చేసిన పోరాట పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాయం రాజిరెడ్డి మనవరాలు దాయం ఝాన్సీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లెంల యాదగిరి, బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు నండూరి కర్ణకుమారి, ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారామ్, వెంపటి గ్రామ సర్పంచ్ తప్పెట్ల ఎల్లయ్య, జిల్లా అధ్యక్షులు ఎడవల్లి శ్రీకాంత్, సిపిఐ మండల కార్యదర్శి పాల్వాయి, పున్నయ్య, నారాయణ, మల్లేష్, మురళి పాల్గొన్నారు.





