
సర్వేపల్లి(ఈటీవీ): నెల్లూరు జిల్లా మనుబోలు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం పశువుల సంత వేలంపాట నిర్వహించారు. డిపాజిట్‌ సొమ్ము రూ.20 వేలుగా నిర్ణయించగా వేలంపాటలో ముగ్గురు పోటీ పడ్డారు. కోవూరుకు చెందిన పుబ్బారెడ్డి మల్లికార్జున్ రెడ్డి రూ. 81.10 లక్షలకు పాడి పశువుల సంతను దక్కించుకున్నారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





