
చింతకాని : సాగర్ జలాలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ పేర్కొన్నారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చింతకానిలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.‌ చింతకాని ప్రధాన సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. యాప్‌ను రద్దుచేసి రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ కరుణశ్రీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేశ్‌, సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మండల కార్యదర్శి దేశ బోయిన ఉపేందర్, వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి వత్సవాయి జానకి రాములు, రైతు సంఘం నాయకులు వెంకట నరసయ్య పాల్గొన్నారు. పందిళ్లపల్లి రాక్ పాయింట్‌కు కాంప్లెక్స్ ఎరువులు రాక చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే రాక్ పాయింట్‌కు మంగళవారం కాంప్లెక్స్ ఎరువు వచ్చినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. 20-20-0-13 రకం కాంప్లెక్స్ ఎరువులు 1337 మెట్రిక్ టన్నులు, 24-24-0 రకం కాంప్లెక్స్ ఎరువులు 1178 మెట్రిక్ టన్నులు ర్యాక్ పాయింట్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలకు లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఎరువులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





