
బెంగుళూరు (చిత్రదుర్గం): చిత్రదుర్గం జిల్లా చెల్లెకెరె తాలూకా గౌరసముద్రం గ్రామంలోని గౌరసముద్ర మారెమ్మ వార్షిక తిరునాళ్ల ఉత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ తిరునాళ్లకు చిత్రదుర్గం, బళ్లారి, తుంకురూ, షిమోగా, బెంగుళూరు, దావణగెర, విజయనగర తదితర జిల్లాల నుంచి, పొరుగున ఉన్న ఏపీలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు తదితర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అమ్మవారికి పూజల నిర్వహించి మొక్కలను తీర్చుకున్నారు. పలువురు భక్తులు, పిల్లలు వేపాకు దుస్తులను ధరించి ప్రదక్షిణలు చేశారు. అమ్మవారి విగ్రహాలను ఊరేగించారు. తిరునాళ్లలో మంత్రి రఘుమూర్తి, రాష్ట్ర ద్రాక్షారస మండలి అధ్యక్షుడు డా. యోగేశ్‌ బాబు, తహసీల్దార్ రెహన్ పాషా తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.