
ఆదోని మార్కెట్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతా హి సేవా ర్యాలీ నిర్వహించారు. పురపాలక కార్యాలయం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం పురపాలక కమిషనర్ నయూమ్ అహ్మద్ మాట్లాడారు. స్వచ్ఛత మన జీవితంలో భాగం కావాలని, తద్వారా సమాజంతోపాటు ఆరోగ్య సమస్యలు దరి చేరవన్నారు. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వ్యవహరించి చెత్తను సూచించిన ప్రదేశాల్లోనే వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సహాయ కమిషనర్ నాసిర్ హుస్సేన్, ప్రజా ఆరోగ్య అధికారి సందీప్, తెదేపా పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, ప్రజా ఆరోగ్య, మెప్మా విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




