
మనం ఎగతాళిగా వాడే ఎందుకూ పనికిరాని గాడిద అనే మాటను ఇప్పుడు మార్చి రాస్తోంది పాకిస్థాన్. ప్రస్తుతం గాడిదలు ఆ దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా మారాయి. పాకిస్థాన్లోని గాడిదలు ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సాయపడుతున్నాయి. మిత్రదేశమైన చైనాకు గాడిదల మాంసం, చర్మాన్ని ఎగుమతి చేస్తూ పాకిస్థాన్ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది.





