
Mohsin Naqvi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. వరుస పరాజయాలు, జట్లలో నిరంతరం జరుగుతున్న మార్పులపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు వహబ్ రియాజ్, ఆకిబ్ జావెద్లపై వేటు వేయడానికి బోర్డు పావులు కదుపుతోంది.




