
Pakistan: ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్ అయిన పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు, ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో తమ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత దారుణమైన స్థానానికి పడిపోయింది. ఆసియా దిగ్గజ జట్లలో ఒకరిగా పేరున్న పాకిస్థాన్, ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి పడిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం వారి కంటే వెనుక కేవలం జింబాబ్వే జట్టు మాత్రమే ఉంది. జింబాబ్వే అసలు టెస్ట్ మ్యాచ్‌లు పెద్దగా ఆడకపోవడం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోవడమే గమనార్హం.




