ఈ వారం ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే తెలుగు బోల్డ్ సినిమా రీసెంట్ సెన్సేషనల్ హిట్ ‘ఇరుముడి’, మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 వంటి సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం పంచునున్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్ ల సంగతి పక్కన పెడితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా ఇప్పుడు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇదొక మలయాళం కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ. సినిమాల్లో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఈ మూవీ గత వారమే రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామాకు హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఓ వైపు నవ్విస్తూనే మరో వైపు భయపెట్టే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయిన ముగ్గురు కుర్రాళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అరవింద్ , వర్కీ , మిథున్ లు కాలేజ్ క్యాంపస్ లో ఉంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని, నైట్ పార్టీలకు డబ్బులు దాచుకోవాలని ప్లాన్ వేస్తారు. అందు కోసం తక్కువ రెంట్‌కి దొరికే ఒక ప్రైవేట్ హాస్టల్ లో చేరుతారు.