
ఈ వారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా ‘హనుమాన్ అంశ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే హిందీలో రికార్డు కలెక్షన్లతో అదరగొడుతున్న ఈ చిత్రం తెలుగులో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? హనుమాన్ అంశ్(తెలుగు)తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా ‘418’, కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన తదితర చిత్రాలు ఈ వారంలోనే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక మరోవైపు ఓటీటీల్లో కూడా ఓ రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. ఓవరాల్ గా 24 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ఇరుముడి’. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు మొదటి రాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఈ వీకెండ్ లో ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి.




