
వీకెండ్లో ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ వినోదాన్ని సిద్ధం చేశాయి. సెప్టెంబర్ 18న పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ తెరపైకి రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’తో పాటు ప్రముఖ నటీనటులు అలరించిన ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈటీవీ విన్లో హర్ష నటించిన ఫన్ రైడ్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రాబోతోంది. ఇక జియోహాట్‌స్టార్‌లో మోహన్‌లాల్ కూతురు విస్మయ నటించిన ‘తుడక్కమ్’, క్రైమ్ థ్రిల్లర్ ‘మ్యాంగో పచ్చ’, భయపెట్టే హారర్ చిత్రం ‘ది మమ్మీ’లు అలరించనున్నాయి.



