
టాలీవుడ్ హీరో రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్ చిత్ర బృందాన్ని అభినందించారు. స్వయంగా తమ ఇంటికి ఆహ్వానించి రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.




