
తుంగతుర్తి, సెప్టెంబర్ 15 : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ఈ నెల 17న గిరిజన గ్రామాల్లో క్షీరాభిషేకం చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య పిలుపునిచ్చారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో గిరిజన నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం చేసే విధంగా కేసీఆర్ 6 శాతం ఉన్న రిజర్వేషన్ 10 శాతానికి పెంచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. అదేవిదంగా చిన్న చిన్న తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వారి తండాలకు వారే సర్పంచులుగా పాలించుకొనే గొప్ప అవకాశం కల్పించారని కొనియాడారు. కొట్లాది రూపాయలు నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించారని, గిరిజనుల అభివృద్దే ధ్యేయంగా గత కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన గిరిజనులను అష్ట కష్టాల పడుతున్నారని, అందుకే భవిష్యత్ లో గిరిజనులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, గిరిజన మాజీ సర్పంచులు యాకు నాయక్, రాములు నాయక్, విరోజీనాయక్, శంకర్ నాయక్, పూన్య నాయక్, దశరధానాయక్, పూర్ణ నాయక్, నాగు నాయక్, వీరు నాయక్, బూక్య ధర్మ, బూక్య రవి, పులాని గోపాల్, బూక్య శ్రీను, మండల నాయకులు గుండగాని దుర్గయ్య, మాల్యాల రాములు, గోపగాని రమేష్, గాజుల యాదగిరి, తెడ్డు హరిబాబు, గోపగాని వెంకన్న, తడకమళ్ల రవి కుమార్, సాయికిరణ్, మల్లిఖార్జున్, మధు పాల్గొన్నారు.





