
అమరావతి : ఏపీలోని నెల్లూరు ( Nellore ) జిల్లా ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్‌లో విద్యుదా ఘాతం( Electrocution ) తో హోంగార్డు ప్రసాద్ ( Home Guard Prasad) మృతి చెందారు. డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రసాద్ పోలీస్ క్వార్టర్స్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన మండపంలో సీరియల్ బల్బ్స్ అమరుస్తుండగా షార్ట్‌సర్క్యూట్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు . సహచరుడు అకాల మృతి పట్ల పోలీసు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Recommended for you

generalప్రహరీ కూలి మూడిళ్లుధ్వంసం




