
పేదరికం కారణంగా పాఠశాలకి వెళ్లలేకపోయిన మాలోదేవి ఇసుకలో వేళ్లతో అక్షరాలు దిద్దుతూ తనకు తానే చదువు నేర్చుకున్నారు. ఇప్పుడు బోధ్‌గయా సమీపంలోని బక్రౌర్‌ గ్రామంలో రావిచెట్టు కిందకి మహిళలను రప్పించి వారికి అక్షరాలు నేర్పిస్తున్నారు. 50 మందికి పైగా గృహిణులకు ఆమె చదవడం, రాయడం, సంతకం చేయడం నేర్పించారు. మరో 30 మంది అదే పనిలో ఉన్నారు. 200మందికి పైగా పిల్లలకు కూడా పాఠాలు బోధించినట్టు చెప్పారు. ‘చిన్నతనంలో నాకు పాఠశాలకు వెళ్లే అవకాశం దొరకలేదు. బడి బయటే నిల్చొని పాఠాలు వింటూ.. నది ఒడ్డున ఇసుకలో సాధన చేసేదానిని. ఆ అనుభవంతోనే గురువుగా మారాను. కనీసం మన సమస్యను నలుగురికి చెప్పగలగాలి అంటే.. చదువు ప్రతి ఒక్కరికీ ఉండాలి. నాకు తెలిసింది ఊరంతటికీ చెప్పడమే నా ఏకైక లక్ష్యం’ అంటూ మాలోదేవి ఊరిలో అక్షర దీపం వెలిగిస్తోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





