
నిరాశ్రయులైన మూడు కుటుంబాలు.. విద్యాధరపురం, న్యూస్‌టుడే: రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చిట్టినగర్‌ కొండ ప్రాంతంలోని జగుపిల్లి రామారావు వీధిలో పి.లక్ష్మి ఇంటి ప్రహరీ గోడ వర్షానికి నాని, కూలి దిగువన ఉన్న ఇళ్లపై పడింది. ముందు రాళ్లు పడుతుండడంతో మూడు ఇళ్లల్లో చీపుళ్ల హైమ, అగురి లావణ్య, బండిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు అప్రమత్తమై పిల్లలను తీసుకొని ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత గోడ మొత్తం కూలి వీరి ఇళ్లపై పడింది. ఘటన పగలు జరగడంతో బాధిత కుటుంబాల్లో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. అండగా నిలుస్తాం.. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌ అన్నారు. కూటమి నాయకులతో కలిసి ప్రహరీ కూలి ధ్వంసమైన ఇళ్లను ఆదివారం పరిశీలించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బడుగు వెంకన్న, చినబాబు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





