
ఆవు నెయ్యి సాధారణంగా పసుపు లేదా బంగారు రంగులో కనిపిస్తే, గేదె నెయ్యి తెలుపు లేదా లేత క్రీమ్ రంగులో కనిపించవచ్చు. అయితే రంగును బట్టి మాత్రమే నెయ్యి నాణ్యతను లేదా ఆరోగ్య ప్రయోజనాలను నిర్ణయించడం సరైంది కాదు. ముఖ్యంగా నెయ్యి ఆరోగ్యకరమైనదే కదా అని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కూడా మంచిది కాదు. మొత్తం ఆహార విధానం, తీసుకునే పరిమాణం, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. అధిక సంతృప్త కొవ్వు తీసుకోవడం LDL కొలెస్ట్రాల్‌ను పెంచే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది.





