
అ డివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘జి2’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవంతమైన ‘గూఢచారి’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. వినయ్‌కుమార్‌ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వామికాగబ్బి కథానాయిక. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఇమ్రాన్‌ హష్మీ, మురళీశర్మ, మధుశాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని బుధవారం ప్రకటించారు నిర్మాతలు. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





