
మద్యం షాపుల రెన్యువల్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ప్రస్తుత లైసెన్సీలకే రెన్యువల్ అవకాశం ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు గడువిచ్చారు. అయితే బుధవారం వరకు 15 శాతం షాపులు అంటే సుమారు 600 షాపుల లైసెన్సీలే రెన్యువల్‌కు ముందుకొచ్చారు.





