
కల్లుగీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల కంటే ఓపెన్ క్యాటగిరీ షాపులకు అధికంగా రెన్యువల్ ఫీజును నిర్ణయించారంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారాని(18వ తేదీ)కి వాయిదా వేసింది.





