
కరీంనగర్‌ జిల్లా ఇస్లాంపూర్‌లో ఘటన సిబ్బందికి మెమో జారీ చేసిన అధికారులు తండ్రితో చిన్నారి అమ్రిన్‌ గంగాధర, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఇస్లాంపూర్‌ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం గదిలో మూడేళ్ల చిన్నారిని వదిలేసి ఆయా తాళం వేసి వెళ్లడం కలకలం సృష్టించింది. ఈ కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్‌ కొద్దిరోజులుగా సెలవులో ఉండగా మంగపేట టీచర్‌ మంజులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రామానికే చెందిన చిన్నారి అమ్రిన్‌ తోటి విద్యార్థులతో కలిసి మంగళవారం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. సాయంత్రం 4 గంటలకు పిల్లలను ఇంటికి పంపించారు. కేంద్రంలోని గదిలో అమ్రిన్‌ నిద్రిస్తుండగా గుర్తించని ఆయా లచ్చమ్మ అంగన్‌వాడీ గదికి తాళం వేసి వెళ్లిపోయారు. చిన్నారి కోసం తల్లిదండ్రులు గాలించగా ఆచూకీ లభించలేదు. మెలకువ వచ్చిన చిన్నారి గది తలుపులు కొడుతూ ఏడవడంతో స్థానికులు గమనించి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు రాత్రి 8 గంటలకు గది తాళం తీయించి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు చిన్నారి కేంద్రంలోనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సీడీపీవో నర్సింగరాణి బుధవారం కేంద్రాన్ని సందర్శించి ఘటనపై విచారణ జరిపారు. ఆయా లచ్చమ్మ, ఇన్‌ఛార్జి టీచర్‌ మంజుల, సూపర్‌వైజర్‌ సంతోషికి మెమో జారీ చేసినట్లు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





