
Cow Ghee vs Buffalo Ghee: ఆవు నెయ్యి మంచిదా? గేదె నెయ్యి మంచిదా? కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఏది బెస్ట్?
భారతీయ వంటకాలలో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. వేడి అన్నం, పప్పు, దోశ, రొట్టెతో పాటు పలు రకాల స్వీట్లలోనూ నెయ్యిని ఉపయోగిస్తుంటారు. అయితే నెయ్యి తినేవారిలో చాలామందికి ఆవు నెయ్యి, గేదె నెయ్యి మధ్య ఏది ఎంచుకోవాలనే సందేహం ఉంటుంది. రెండింటిలోనూ కొవ్వు అధికంగా ఉంటుంది. అయితే పాలలోని సహజ లక్షణాలు, తయారీ విధానం, పోషక విలువలు వంటి అంశాల ఆధారంగా వాటి రంగు, రుచి, ఆకృతి మారవచ్చు.





















