ఫోర్టిపైడ్ చేసిన పాలు, పెరుగు, ధాన్యాల్లో కాల్షియం, విటమిన్ బి, డి ఎక్కువగా ఉంటాయి. ఇవి నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నరాల బలహీనత తగ్గించి తిమ్మిర్లు రాకుండా కాపాడుతాయని NLM అధ్యయనం పేర్కొంది.
పాలకూర, మునగాకు, మెంతికూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి నరాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తిమ్మిర్లు తగ్గించడంలో దోహదపడతాయి.
బాదం, వాల్నట్స్, గుమ్మడి, పొద్దు తిరుగుడు, అవిసె గింజల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి నరాలను కాపాడుతాయి. నరాల బలం పెంచి తిమ్మిర్లు రాకుండా చూస్తాయి.
ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, గోధుమలు లాంటి తృణధాన్యాల్లో విటమిన్ బి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడమే కాకుండా నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా తిమ్మిర్లు తగ్గుతాయి.
కోడిగుడ్లలో విటమిన్ బి12 కావాల్సినంత ఉంటుంది. అలాగే ఇందులోని ప్రోటీన్ నరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో నరాల బలహీనత తగ్గిపోయి తిమ్మిర్లు రాకుండా చూసుకోవచ్చు.
పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, మసూర్ పప్పు, శనగలు, రాజ్మా, బొబ్బర్లు లాంటి పప్పులు, బీన్స్ తినడం ద్వారా ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. అలాగే వీటిలోని విటమిన్ బి నరాలను హెల్తీగా ఉంచుతుంది. తద్వారా తిమ్మిర్లు రాకుండా కాపాడుకోవచ్చు.
అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెరుగుపర్చి నరాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. తక్షణ శక్తిని అందించడమే కాకుండా తిమ్మిర్లు తగ్గిస్తుంది.
సాల్మోన్, ట్యూనా, సార్డైన్, మాకరెల్ లాంటి కొవ్వు చేపలు తింటే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ డి అందుతాయి. ఇవి నరాలను బలంగా ఉంచి తిమ్మిర్లు రాకుండా కాపాడుతాయి. అందుకే వారంలో ఒకసారి ఈ చేపలు తినడం మంచిది.
అల్లం, పసుపులోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు నరాల నొప్పి, నరాల బలహీనత రాకుండా కాపాడుతాయి. అలాగే తిమ్మిర్ల సమస్యను తగ్గిస్తాయి.