
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
AP EAPCET Result 2026 Download Rank Card: ఎన్నో రోజులుగా నిరీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ఈరోజు ఉదయం 11 గంటలకు సెట్ కమిటీతో సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేస్తారు. మే 12 నుండి 20వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ ఎంసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచిన తర్వాత, విద్యార్థులు నేరుగా తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుంది.
ఏపీ ఎంసెట్ 2026 ఫలితాలను డౌన్లోడ్ చేసుకునే విధానం: మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేసిన తర్వాత విద్యార్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఏపీ అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేసి, అక్కడ ఉన్న ర్యాంక్ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి. ఆ తర్వాత ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చరల్ ర్యాంక్ కార్డు కనిపిస్తుంది, అక్కడి నుండి మీ స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ 2026 ప్రక్రియ.. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు త్వరలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తారు. విద్యార్థులు తమకు నచ్చిన కౌన్సిలింగ్ ఫేస్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ ఆఫ్ మార్కులు, ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.
దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్షను జేఎన్టీయూ కాకినాడ నిర్వహించింది. మొదట జూన్ 1వ తేదీనే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేసి, నేడు విడుదల చేస్తున్నారు. ఇందులో 25 శాతం ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీని ఇవ్వనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.