
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Anirudh - Kavya Maran Wedding News: దక్షిణ భారత యువ సంగీత సంచలనం అనిరుథ్.. హైదరాబాద్ సన్ రైజర్స్ యజామాని కావ్యమారన్ ఒక్కటి కాబోతున్నారా..? వీరిద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారా అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. అనిరుథ్, కావ్యమారన్ వీరి మధ్య ఉన్న బంధంపై గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రచారంపై స్పందించిన అనిరుధ్ “ఇవి కేవలం రూమర్స్ మాత్రమే” అంటూ కొట్టిపారేశారు. అయితే తాజాగా ఆయన బాబాయ్, సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వార్తలకు కొత్త ఊపు వచ్చింది. “అనిరుధ్ మృదు స్వభావి. కావ్య సాధారణ వ్యక్తి కాదు. ఇద్దరూ మంచి జంట. కలిసి మ్యూజిక్ బిజినెస్‌లో కూడా వీరు రాణించగలరు అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో కావ్య పాప - అనిరుథ్ పెళ్లి టాపిక్.. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కావ్య–అనిరుధ్ పెళ్లి టాపిక్ మరింతగా ట్రెండ్ అవుతోంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్’,‘బీస్ట్’ చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. వీరి పెళ్లిని విదేశాల్లో లండన్ లేదా ఇటలీలో సీక్రెట్‌గా ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
ఖండించిన కావ్యమారన్ సన్నిహిత వర్గాలు.. అయితే కావ్య మారన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. అవన్నీ బేస్‌లెస్ రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేశాయి. అనిరుధ్ కూడా ఇటీవల ఒక ప్రెస్ మీట్లో పెళ్లి ప్రస్తావన రాగానే నవ్వుతూ దాటవేశారు. ప్రస్తుతం ఈ క్రేజీ జంటపై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఎలాంటి ధృవీకరణ రాలేదు. అయితే అభిమానులు మాత్రం అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వార్తలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.